నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణ క్రాకలో సంక్రాంతి సందర్భంగా మంగళవారం ఎద్దుల పోటీలు నిర్వహించారు. ఎంతో వైభవంగా నిర్వహించిన ఈ పోటీలకు భారీగా ఎడ్లు వచ్చాయి. ఎడ్ల పోటీలను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. కావలి, ఉదయగిరి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి రానున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.