ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పటివరకు కందిపప్పు సరఫరా జరగలేదు. ఉదయగిరి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని కొన్ని గ్రామాల్లో రేషన్ దుకాణంలో బియ్యం, నూనె మాత్రమే ఇచ్చారని కందిపప్పు సరఫరా కాదని అంగన్వాడీలు తెలిపారు. అలాగే బాలామృతం వాహనదారులు అన్ని గ్రామాలకు వెళ్లకుండా ఒకే చోట రెండు మూడు గ్రామాలకు సంబంధించిన బాలామృతాన్ని దించడంతో అంగన్వాడి సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.