రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని నెల్లూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, టిడిపి రాష్ట్ర ఆర్గనైజషన్ సెక్రటరీ చెంచల బాబు యాదవ్ శనివారం కలిశారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి గురించి ఆయనతో చర్చించారు. జిల్లాలో ఎక్కువ మండలాలు కలిగిన ఉదయగిరి నియోజకవర్గంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారని వారికి తగిన ఉపాధి కల్పించాలని కోరారు.