ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సోమవారం అసెంబ్లీలో నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల సమస్యలపై మాట్లాడారు. ఉదయగిరి ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, ప్రియాక్టిషన్ డాక్టర్లు లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉందన్నారు. అలాగే ఎమర్జెన్సీ సర్వీస్ లు కూడా ఏర్పాటు చేయాలని కోరారు. నియోజకవర్గంలో రెండు ఆసుపత్రులలో కూడా లేబర్ రూములు చాలా దారుణంగా ఉన్నాయి అని వాటి గురించి కూడా ఒకసారి ఆలోచించాలని తెలిపారు.