బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ఉదయగిరి, సీతారాంపురం మండలాల్లో కనీసం మోస్తారు వర్షం కూడా కురవడం లేదు. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు, రైతులు నిరుస్తాహానికి గురయ్యారు. ఆకాశం మేఘమృతమై నల్లటి కారు మబ్బులు కమ్ముకున్నప్పటికీ వర్షం పడటం లేదు. ఈ వర్షం కురిస్తే భూగర్భ జలాలు అభివృద్ధి చెందడంతో పాటు చెరువులు, బావులు నిండుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.