వరద ప్రాంతాల్లో పర్యటించిన ఉదయగిరి ఎమ్మెల్యే

66చూసినవారు
వింజమూరు మండలంలో వర్షం శనివారం ఉగ్రరూపం దాల్చింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే భీకర వర్షం కురవడంతో వింజమూరు లోని బీసీ కాలనీ, జిబికేఆర్ఎస్టి కాలనీ లోని సుమారు 100ఇళ్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. వెంటనే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అక్కడ పర్యటించి, స్థానిక నాయకులు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నీటిని తొలగించి పూర్వస్థితికి తీసుకురావాలన్నారు. వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్