వరికుంటపాడు: విద్యుత్ ఘాతానికి గేదె మృతి

82చూసినవారు
వరికుంటపాడు: విద్యుత్ ఘాతానికి గేదె మృతి
వరికుంటపాడు మండలంలోని డక్కునూరు జగనన్న లేఅవుట్ సమీపంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తగిలి గేదె మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవరపు చిన్న వెంకటయ్యకు చెందిన గేదె ప్రమాదవశాత్తు మేతకు అటుగా వెళ్లి విద్యుత్ ఘాతానికి చనిపోయింది. మృతి చెందిన గేదె విలువ సుమారు రూ. 80 వేల వరకు ఉంటుందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

సంబంధిత పోస్ట్