అనంతపురంలో జరిగిన అవినీతి, అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని మేయర్ వసీంకు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే లక్ష్మీనరసింహ సవాల్ విసిరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణ పనులలో మేయర్ వసీం, మాజీ ఎమ్యెల్యే అనంత వెంకటరామిరెడ్డిలకు కమీషన్లు అందాయని ఆరోపించారు. సొంత వైసీపీ నేతలు రాగే పరుశురాం, చవ్వా, నదీమ్ లాంటి వ్యక్తులను పక్కన బెట్టి నీచ రాజకీయాలకు పాల్పడ్డారన్నారు.