గుత్తి: పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం

74చూసినవారు
అనంతపురం జిల్లా గుత్తి మండలం పరిధి లోని మామూడూరు గ్రామంలో గురువారం రాధిక అనే మహిళ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం రిఫర్ చేశారు. కుటుంబ కలహాల కారణంగానే రాధిక పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్