అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ విద్యార్థులతో సహపంక్తి భోజనం శనివారం చేశారు. మండల కేంద్రమైన నార్పలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్థానిక కళాశాలలో ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. పథకాన్ని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోవాలని సూచించారు. ఇది చాలా మంచి పథకమని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.