ఈ నెల 28న గుంతకల్లులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

56చూసినవారు
ఈ నెల 28న గుంతకల్లులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ఈ నెల 28వ తేదీన గుంతకల్లులో సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. గుంతకల్లు రెవెన్యూ డివిజన్ కు సంబంధించి ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తామన్నారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్