అనంతపురంలోని రామచంద్ర నగర్ లో ఉన్న రైల్వే గేట్ ను సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైలు పట్టాల వద్ద మరమ్మతుల కారణంగా గేట్ ను మూసివేస్తున్నట్లు వెల్లడించారు. నాలుగు రోజుల అనంతరం యథాతథంగా వాహన రాకపోకలు జరుగుతాయని తెలిపారు. ఈ మార్గం గుండా వెళ్లే వాహనదారులు సైఫుల్లా ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి వెళ్లడానికి ప్రత్యామ్నాయ మార్గం అనువుగా ఉంటుంది.