విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐఎస్ఎఫ్

79చూసినవారు
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐఎస్ఎఫ్
అనంతపురం నగరంలో హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలో ఉన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్ ను నగరంలోకి మార్చాలని, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్సీ డిడి కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హనుమంతురాయుడు, కుళ్లాయిస్వామి మాట్లాడుతూ.. హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలో ఉన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులు కళాశాలకు రావాలంటే సుమారు ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉందన్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు.

సంబంధిత పోస్ట్