ధర్మవరం మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్ సోర్సింగ్ కార్మికుల నూతన కమిటీని శుక్రవారం కార్మికుల ఓటింగ్ పద్ధతిన ఇంజినీరింగ్ సెక్షన్ కార్మికుల అధ్యక్ష, కార్యదర్శుల నియామకం జరిగింది. యూనియన్ అధ్యక్షులుగా బొగ్గు నాగరాజు, ఉపాధ్యక్షులుగా అంకే పెద్దన్న, దాసరి సురేష్, కార్యదర్శులుగా జయకృష్ణ, బాబు, కోశాధికారిగా అనీల్ కుమార్, కాటమయ్యను ఎన్నుకోవడం జరిగింది.