డెంగ్యూ వ్యాధిపై పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా సహాయ మలేరియా అధికారి లక్ష్మీనాయక్ పేర్కొన్నారు. శుక్రవారం ధర్మవరం పట్టణంలోని శివానగర్ లో జిల్లా సహాయ మలేరియా అధికారితో పాటు సబ్ యూనిట్ మలేరియా అధికారులు పర్యటించి డెంగ్యూ వ్యాధిపై ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ నాయక్ మాట్లాడుతూ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని తొట్టెల్లో నీరు నిలువ లేకుండా చూడాలన్నారు.