కశ్మీర్ బార్డర్ లో గుండెపోటుతో మృతి చెందిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వెంకట రమణారెడ్డి (46) అంతిమయాత్ర ధర్మవరంలో శుక్రవారం ప్రారంభమైంది. భారీ జనసందోహం మధ్య యాత్ర జరుగుతోంది. పట్టణంలోని పలు వీధుల గుండా జరుగుతున్న అంతిమ యాత్రలో వందలాది మంది ప్రజలు పాల్గొని సైనికుడికి వీడ్కులు పలుకుతున్నారు. భారత్ మాతాకీ జై అన్న నినాదాలతో యాత్ర సాగుతోంది.