సినీ నటుడు మోహన్ బాబు జర్నిలిస్టులపై చేసిన దాడికి నిరసనగా ఏపీయూడబ్ల్యూజే ధర్మవరం రెవెన్యూ డివిజన్ సభ్యులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడు జనపాటి మోహన్, ప్రధాన కార్యదర్శి అజయ్ చౌదరి మాట్లాడుతూ. విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులపై దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్, కాలేజ్ సర్కిల్, కళా జ్యోతి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.