మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల కనీస వేతనం పెంచాలంటూ సీఐటీయూ మండల కన్వీనర్ జేవీ రమణ శుక్రవారం పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వేతనం పెంచకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.