హాకీ ఇండియా ఆధ్వర్యంలో పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లో ఈ నెల 9 నుంచి 19 వరకు 14వ పురుషుల జాతీయ జూనియర్ హాకీ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టులో ధర్మవరం క్రీడాకారులు మహబూబ్ బాషా, మహమ్మద్ రఫీ గురువారం ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులకు హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్, హాకీ సత్యసాయి జిల్లా జనరల్ సెక్రటరీ బంధనాతం సూర్య ప్రకాశ్, హాకీ కోచ్ హసేన్ అభినందించారు.