గుంతకల్లు పట్టణ పరిధిలోని 33వ వార్డు బెంచ్ కొట్టాల ఏరియాలో పారిశుధ్య కార్మికులు చేస్తున్న పనులను శుక్రవారం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య పరిశీలించారు. అనంతరం సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ పాఠశాల వద్ద పరిసరాలను పరిశీలించి అక్కడ ఉన్న మురికి కాలువలో పేరుకుపోయిన మురుగు తీయించాలని సచివాలయం శానిటరీ కార్యదర్శిని ఆదేశించారు. ఆయనతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అన్నారు.