గుంతకల్లు పట్టణంలోని సోనియా గాంధీ కాలనీలోని ఎల్పీ నం. 49-1985లో ఉన్న ఓపెన్ సైట్లో ఆక్రమణలను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఆదివారం కమిషనర్ నయీమ్ అహ్మద్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఓపెన్ సైట్ పాతిన బండలను తీసివేయించారు. రిజర్స్డ్ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు చేపడుతామని కమిషనర్ నయీమ్ అహ్మద్ పట్టణ ప్రజలకు హెచ్చరించారు.