అనంతపురం జిల్లా గుత్తి మండలం పరిధి లోని చెర్లోపల్లి గ్రామ సమీపంలో కొండపై వెలసిన చెన్నకేశవ స్వామి రథోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ స్వామిని అందంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ వెంకటేశ్, గ్రామ పెద్దలు పాల్గొని వేడుకలు నిర్వహించారు. ఇవాళ సాయంత్రం రథోత్సవం ఉంటుందని తెలిపారు.