డిసెంబర్ 14న జరుగునున్న జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలని ఏడీజే శ్రీహరి కోరారు. గుత్తి ఏడీజే కోర్టు ఆవరణలో గురువారం పోలీసులు, బ్యాంకర్లు, న్యాయవాదులు తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీజే శ్రీహరి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్లో రాజీకి అవకాశం ఉన్న కేసులన్నింటినీ పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనన్ని ఎక్కువ కేసులను పరిష్కారం చేయాలన్నారు.