హిందూపురం: పాఠశాల అదనపు గదులకు రూ.30వేల విరాళం

77చూసినవారు
హిందూపురం: పాఠశాల అదనపు గదులకు  రూ.30వేల విరాళం
లేపాక్షి మండలంలో గల మైదుగోళం గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం రూ.30వేల విరాళం అందించారు. పాఠశాల తరగతి గదుల కొరతతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని మండల కన్వీనర్ జయప్ప, మాజీ ఎంపీపీ ఆనంద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన తాత్కాలిక గదుల నిర్మాణానికి సహాయ సహకారాలు చేస్తానని ఇచ్చిన హామీ మేరకు విరాళాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్