కదిరి పట్టణంలోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపాన్ని అభివృద్ది చేయాలని జనసేన పట్టణ ఉపాధ్యక్షులు, రాయల్ పీపుల్స్ ఫ్రంట్ కన్వీనర్ లక్ష్మణ కుటాల పేర్కొన్నారు. గురువారం కళ్యాణ మండపం స్థలాన్ని సర్వే చెయ్యడానికి వచ్చిన అధికారి రేరాజు సియోధర్ కి కూటమి తరపున వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సేవా భారతి శరత్ కుమార్ రెడ్డి, హరినాథ్ నాయుడ , అరుణ్ కుమార్, మనోజ్, గంగాద్రి తదితరులు పాల్గొన్నారు.