వరద బాధితులకు విరాళం అందించిన ఉపాధ్యాయుడు

77చూసినవారు
వరద బాధితులకు విరాళం అందించిన ఉపాధ్యాయుడు
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పని చేస్తున్న టీచర్ బద్దే నాయక్ తన నెల జీతం రూ. 66, 245లను విజయవాడ వరద బాధితులకు సహాయార్థం మంగళవారం కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబుకి చెక్ అందజేశారు. వరదలు వచ్చి విజయవాడ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా పలువురు విరాళాలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని ఉపాధ్యాయుడు బద్దేనాయక్ ను అభినందించారు.

సంబంధిత పోస్ట్