సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాత బుధవారం కళ్యాణదుర్గం చేరుకుంది. ఈ సందర్భంగా జగజీవన్ రామ్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు ప్రసంగించారు. రైతులకు, కార్మికులకు బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఈనెల 26వ తేదిన అనంతపురం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.