కళ్యాణదుర్గం: వైభవంగా మల్లిపల్లి శ్రీ చౌడేశ్వరి జాతర

53చూసినవారు
కళ్యాణదుర్గం: వైభవంగా మల్లిపల్లి శ్రీ చౌడేశ్వరి జాతర
కళ్యాణదుర్గం మండల పరిధిలోని మల్లిపల్లిలో శ్రీ చౌడేశ్వరి జాతరను మంగళవారం వైభవంగా నిర్వహించారు. తొగట వీర క్షత్రియ వంశోద్భవుల ఆరాధ్య దైవమైన శ్రీ మహాలక్ష్మి చౌడేశ్వరి జాతర సందర్భంగా దీపారాధన జ్యోతుల ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన అమ్మవారి భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు ముఖ్య అతిథిగా ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్