కళ్యాణదుర్గం: వన దుర్గాదేవి అలంకారంలో వాసవి మాత

66చూసినవారు
కళ్యాణదుర్గం: వన దుర్గాదేవి అలంకారంలో వాసవి మాత
కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో గురువారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం, ఆలయ కమిటీ, మహిళా మండలి ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వాసవి మాతకు వన దుర్గాదేవి అలంకరణ చేశారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న వాసవి మాతను భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్