
కళ్యాణదుర్గం: పింఛన్లు పంపిణీ చేసిన కూటమి నాయకులు
కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక బాధ్యత పింఛన్లను ఒకరోజు ముందుగానే మొదలైంది. బుధవారం సెలవు కావడంతో మంగళవారం తెల్లవారుజాము నుంచే సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము పంపిణీ చేశారు. కళ్యాణదుర్గం పట్టణంలోని 15వ వార్డులో మున్సిపల్ మాజీ ఛైర్మన్ బిక్కి రామలక్ష్మి, గోవిందప్ప ఆధ్వర్యంలో తెల్లవారుజామున 5 గంటలకే పింఛన్లు పంపిణీ చేశారు.