
కళ్యాణదుర్గం: దానిమ్మ మొక్కలకు నిప్పంటించిన దుండగులు
కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామంలో రైతు నాగేంద్రకు సంబంధించిన 10ఎకరాల పొలంలో 4500 దానిమ్మ మొక్కలను నాటుకున్నాడు. అయితే ఎవరో గుర్తు తెలియని దుండగులు ఆదివారం ఆ మొక్కలకు నిప్పంటించడంతో అరు సంవత్సరాల వయస్సు కల్గిన మొక్కలన్నీ మంటల్లో కాలిపోయి బూడిదగా మారాయి. మొక్కల సంరక్షణ కోసం పర్చిన డ్రిప్ పరికరాలన్నీ ఆ మంటల్లో ధ్వంసం అయ్యాయి. తద్వారా బాధిత రైతుకు సుమారుగా 10లక్షల రూపాయలు మేర నష్టం వాటిల్లింది.