కళ్యాణదుర్గం: పాలవాయి చెరువులోకి భారీగా చేరిన వరదనీరు

69చూసినవారు
కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలోని చెరువులోకి భారీగా వర్షం నీరు చేరుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వర్షం నీరు పాలవాయి చెరువులోకి వస్తోంది. ఈ క్రమంలో బుధవారం చెరువు పూర్తిస్థాయిలో నిండింది. చెరువు నిండడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోర్లలో కూడా సమృద్ధిగా నీళ్లు లభిస్తాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్