
కళ్యాణదుర్గం: జాతీయ జూడో పోటీలకు విద్యార్థి ఎంపిక
కళ్యాణదుర్గం మండలం పాపంపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి మహీధర్ జాతీయ జూడో సబ్ జూనియర్ పోటీలకు ఎంపికయ్యాడని వ్యాయామ ఉపాధ్యాయుడు శుక్రవారం తెలిపారు. ఇటీవల గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో మహీధర్ అత్యంత ప్రతిభ కనబరిచాడు. దీంతో నిర్వాహకులు మహీధర్ ను జాతీయస్థాయి జూడో పోటీలకు ఎంపిక చేశారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న జాతీయస్థాయి జూడో సబ్ జూనియర్ పోటీల్లో మహీధర్ పాల్గొంటారు.