పెనుకొండ: అన్నపూర్ణేశ్వరి అలంకరణలో మహేశ్వరి దేవి

54చూసినవారు
పెనుకొండ: అన్నపూర్ణేశ్వరి అలంకరణలో మహేశ్వరి దేవి
పెనుకొండ మండల పరిధిలోని చంద్రగిరిలో శ్రీగిరి శక్తి పీఠంలో వెలసిన మహేశ్వరి దేవి శనివారం అన్నపూర్ణేశ్వరి అలంకరణలో దర్శనం ఇచ్చారు. శ్రీ గిరి పీఠాధిపతి దేవేంద్ర స్వామి శరన్నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు మహేశ్వరి అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, దీపారాధన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని అన్నపూర్ణేశ్వరిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్