పెనుకొండ: విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి: సీఐటీయూ

76చూసినవారు
పెనుకొండ: విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి: సీఐటీయూ
విద్యాశాఖ, ఆర్టీవో నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేశ్ అన్నారు. శుక్రవారం పెనుకొండ సీఐటీయూ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పెనుకొండ మండలం ఇస్లాపురం గ్రామానికి చెందిన అఖిల్(13) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమన్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే విద్యార్థి మరణించారని, విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్