హిందూపురంలోని శ్రీసత్యసాయి ప్రేమ సదన్ కు మంత్రి సవిత విద్యార్థుల సంక్షేమం కోసం రూ. 2లక్షల చెక్కును నిర్వాహకులకు అందజేశారు. బుధవారం మంత్రి సవిత జన్మదినాన్ని ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఆశ్రమంలో జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులతో కేక్ కట్ చేసి, భోజన వసతి ఏర్పాటు చేసి, యూనిఫామ్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సత్యసాయి బాబా చూపించిన ఆధ్యాత్మిక, సేవా మార్గం మనందరికీ ఆచరణీయం అన్నారు.