మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న టీడీపీ సోషల్ మీడియా సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, జిల్లా ఎస్పీకి శనివారం ఫిర్యాదు చేశారు. పుట్టపర్తిలోని ఎస్పీ కార్యాలయంలో టీడీపీ సోషల్ మీడియా అసభ్యకరమైన పోస్టులకు సంబంధించిన ఆధారాలతో ఆమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.