ఆధ్యాత్మిక కేంద్రంలో పేరుకుపోయిన చెత్తాచెదారం

71చూసినవారు
ఆధ్యాత్మిక కేంద్రంలో పేరుకుపోయిన చెత్తాచెదారం
ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో ప్రధాన రహదారిపై చెత్తాచెదారం పేరుకుపోయి వాటి నుంచి భయంకరమైన దుర్వాసన వెదజల్లుతోందని గురువారం పుట్టపర్తి ప్రజలు వాపోయారు. మున్సిపాలిటీ కార్యాలయానికి సమీపంలోని ప్రధాన రహదారిపై చెత్త పేరుకుపోయి అక్కడ పందులు సంచారం అధికమై ప్రజలకు ఇబ్బందిగా మారింది. పట్టణంలోకి పందులు రాకుండా చూడాల్సిన అధికారులు కనీస చర్యలు చేపట్టకపోవడంతో ప్రధాన రహదారులు చెత్తాచెదారంతో నిండిపోతున్నాయి.

సంబంధిత పోస్ట్