మడకశిర: పాఠశాలల పనివేళల మార్పుపై పునః సమీక్షించాలి: డిటిఎఫ్

70చూసినవారు
మడకశిర: పాఠశాలల పనివేళల మార్పుపై పునః సమీక్షించాలి: డిటిఎఫ్
రొళ్ళ మండల కేంద్రంలో డిటిఎఫ్ నాయకులు మాట్లాడుతూ పాఠశాలల్ని ప్రయోగశాలగా మార్చవద్దని డిటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గౌస్ లాజమ్, మారుతి ప్రసాద్ ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు బుధవారం డిటిఎఫ్ నేతలు ఒక ప్రకటన విడుదల చేస్తూ విద్యార్థుల అభ్యసన సంసిద్ధత, రవాణా సౌకర్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా హఠాత్తుగా పాఠశాల పనివేళల పొడిగింపు నిర్ణయం సరికాదన్నారు. ప్రభుత్వం పునర్ ఆలోచించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్