సత్యసాయి విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును సత్యసాయి ట్రస్ట్ ఆర్గనైజింగ్ ట్రస్ట్ ఆర్ జె రత్నాకర్ కలిశారు. గురువారం సాయంత్రం మడకశిర నుంచి ముఖ్యమంత్రి హెలికాప్టర్ పుట్టపర్తికి చేరుకొని అక్కడ నుంచి విమానం ద్వారా గన్నవరం వెళుతున్న సందర్భంలో ట్రస్టు సభ్యులు రత్నాకర్ చంద్రబాబును కలిసి పలు విషయాలపై చర్చించారు.