అమడగురు మండల కేంద్రంలో గురువారం మాట్లాడుతూ ఉద్యోగులు పిల్లల సంరక్షణ సెలవులను 10 విడతల్లోనే వినియోగించుకోవాలన్న షరతును ఎత్తివేయాలని డిటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కట్టుబడి గౌస్ లాజమ్, మారుతి ప్రసాద్, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 10 విడతలు దాటిన వారికి అధికారులు అనుమతించకపోవడంతో సెలవులను నష్టపోవాల్సి వస్తోందని, ముఖ ఆధారిత గుర్తింపు హాజరు యాప్లో సెలవు దరఖాస్తులో ఉంచిన 10 విడతల సీలింగ్ ఎత్తివేయాలని కోరారు.