బుక్కపట్నంలోని శ్రీ సత్యసాయి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 19వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మక్బుల్ హుస్సేన్, జిల్లా నైపుణ్యాధికారి హరికృష్ణ బుధవారం ప్రకటనలో తెలిపారు. 10, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసి 18 నుంచి 35 సంవత్సరాలు వయసు ఉన్నవారు అర్హులన్నారు. అభ్యర్థులు తమ బయోడేటా తో పాటు ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలు తీసుకొని ఉదయం 9 గంకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు: 7981541994