అనంతపురం జిల్లా ఎక్సైజ్ పోలీసులు సోమవారం రాత్రి రూ. 65 లక్షల విలువైన గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాప్తాడు సమీపంలోని రైల్వే గేట్ వద్ద ఉన్న ఫామ్ హౌస్లో గోవా మద్యాన్ని గుర్తించి సీజ్ చేశామన్నారు. అనంతరం మద్యాన్ని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.