TG: మోహన్ బాబు కుటుంబంలో చెలరేగిన చిచ్చుపై టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. మోహన్ బాబు కుటుంబానికి ఏదో నర ఘోష తగిలినట్టుందని అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమలో మంచు కుటుంబానికి మంచి పేరుందని, కానీ ఇలాంటి పరిణామాలు దురదృష్టకరమని అన్నారు. అందరి తరఫు నుంచి మోహన్ బాబు కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను... ఈ గొడవకు ఇంతటితో స్వస్తి పలకాలి" అని నట్టి కుమార్ పేర్కొన్నారు.