ఆత్మకూరు మండలంలోని గోరిదిండ్ల, తోపుదుర్తి గ్రామాల్లో నూతన విద్యుత్ ఉప కేంద్రాలు నిర్మించడానికి విద్యుత్ శాఖ అధికారులు స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు అధికారులు రెండు గ్రామాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ కన్స్ట్రక్షన్ ఈఈ మనోరమ మాట్లాడుతూ.. వోల్టేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని ఫిర్యాదు రావడంతో నూతన ఉప కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.