చదువుతో పాటు క్రీడలు అవసరం: ఎమ్మెల్యే

80చూసినవారు
చదువుతో పాటు క్రీడలు అవసరం: ఎమ్మెల్యే
ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు కూడా చాలా అవసరం అని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రామగిరి మండల కేంద్రంలోని పరిటాల రవీంద్ర మెమోరియల్ క్రీడా మైదానంలో జరుగుతున్న 68వ స్కూల్ గేమ్స్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికి సంబంధించిన నియోజకవర్గ స్థాయి క్రీడాపోటీలు జరుగుతున్నాయి. కాగా ఈ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తోందని. ఇక్కడ ఎలాంటి అవసరం ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సునీత అన్నారు.

సంబంధిత పోస్ట్