బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలో పరిశ్రమల వెదజల్లే కాలుష్యం వల్ల పంటలు తీవ్రంగా నష్టపోతున్నామంటూ రైతన్నలు తమ గోడును శనివారం పొల్యూషన్ అధికారికి వివరించుటకు పెద్దఎత్తున పంట పొలాల వద్దకు రైతన్నలు విచ్చేశారు. అలర్ట్ అయిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. రైతన్నల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే అధికారికి మీమీ సమస్యలను నిదానంగా వివరించాలన్నారు. రూరల్ సీఐ, హీరేహల్ ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.