రాయదుర్గం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వెంకటరమణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ప్రొద్దుటూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న వెంకటరమణను ఉన్నత అధికారులు రాయదుర్గం రూరల్ సర్కిల్ కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన బాధ్యతలు చేపట్టి మీడియాతో మాట్లాడారు. శాంతి భద్రతల కోసం ప్రజలు తమకు సహకరించాలని కోరారు.