డి. హిరేహాల్ మండలం మురిడి గ్రామానికి చెందిన రుద్రప్ప మూడు రోజుల క్రితం అదృశ్యమైనట్లు అతని తల్లిదండ్రులు నాగేంద్ర, మీనాక్షి ఫిర్యాదు చేశారు. సోమవారం హెచ్ఎల్ సి డిస్ట్రిబ్యూటరీ కాలువలో రుద్రప్ప మృతదేహం లభించిందన్నారు. మృతుడు మద్యం తాగి ఇంటికి రావడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఇంటిని వదిలి వెళ్లి తాను మృతి చెందుతున్నట్లు వీడియో సెల్ఫీ పంపాడన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.