దంచికొట్టిన వర్షం... జలకలను సంతరించుకున్న నాన్ చెరువు

78చూసినవారు
రాయదుర్గం పట్టణంలో గత అర్ధరాత్రి వర్షం దంచి దంచి కొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షం నమోదయింది. దీంతో కాలువలు, రోడ్లపై వర్షపు నీరు ఉరకలెత్తింది. బుధవారం చెక్ పోస్ట్ అభయ ఆంజనేయస్వామి ఎదురుగా ఉన్న నాన్ చెరువులోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో జలకలను సంతరించుకోవడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నీటి చేరికను పరిశీలించి ఆనందించారు.

సంబంధిత పోస్ట్